కొత్తగూడెం ఎక్సైజ్ పోలీసులు 319 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో వివిధ కేసులలో ఒక మహిళ, ఆమె కొడుకు సహా 10 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఒడిశా సరిహద్దు నుంచి 100 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేసులో పెద్దపల్లి జిల్లా కొత్తపల్లికి చెందిన మహిళ నేరళ్ల అపర్ణ, ఆమె కుమారుడు ఎన్.అఖిల్ పట్టుబడ్డారు. అపర్ణ భర్త సదయ్య గంజాయి కేసులో అరెస్టయి జైలులో ఉన్నాడు.
పేరుమోసిన గంజాయి స్మగ్లర్లు, నిజామాబాద్‌కు చెందిన మునవర్ అలీ, హైదరాబాద్‌లోని బేగంబజార్‌కు చెందిన దత్తు పంచల్‌లతో పాటు హైదరాబాద్‌లోని బాలా నగర్‌కు చెందిన శక్తి రాహుల్, గోపిశెట్టి అక్షిత్‌లను కూడా అరెస్టు చేశారు. ఇలా పట్టుబడిన గంజాయి విలువ రూ.79.75 లక్షలు. అంతేగాకుంజా 21 లక్షల విలువైన రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.