Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో యూపీఏ సేవలకు ఎండ్ కార్డ్ పడనుందా?

Google pay

సెల్వి

, మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (21:39 IST)
భారత్‌లో యూపీఏ సేవలకు ఎండ్ కార్డ్ పడనుందా అంటే సర్వేలు అవుననే చెప్తున్నాయి. యూపీఏ వినియోగదారులపై ఇటీవలి సర్వేలో ఈ విషయం వెల్లడి అయ్యింది. లోకల్‌ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో భారతదేశంలో యూపీఏ చెల్లింపుల భవిష్యత్తుకు సంబంధించి చాలా ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడి అయ్యాయి. 
 
యూపీఏ లావాదేవీలపై రుసుము విధిస్తే దేశంలో ఈ సేవలను భారతీయులు కొనసాగించడం కష్టమేనని తెలిసింది. యూపీఏ లావాదేవీలపై రుసుము విధిస్తే కనుక ఆ సేవలకు బైబై చెప్పేస్తామని అత్యధికంగా 75 శాతం మంది వినియోగదారులు ఓటేశారు. 
 
రుసుము విధిస్తే.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌లను ఉపయోగించడాన్ని ఆపివేస్తామని స్పష్టం చేశారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, 22% మంది వినియోగదారులు తమపై విధించే కొన్ని రకాల లావాదేవీల రుసుములకు అనుకూలంగా ఓటు వేశారు. 
 
308 జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. ప్రస్తుతానికి, భారతదేశంలో మొత్తం UPI లావాదేవీలు 100 బిలియన్ల మార్కును అధిగమించాయి. ఈ సర్వే వివరణాత్మక ఫలితాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందించబడతాయి. 
 
ఇది ప్రజల మానసిక స్థితిని అంచనా వేయడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది. భవిష్యత్తులో యూపీఐకి ఎలాంటి లావాదేవీల రుసుములను జోడించకూడదనే ప్రజాభిప్రాయం వైపు ప్రభుత్వాన్ని నడిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ వరద క్లెయిమ్‌ల నిర్వహణ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో జరుగుతుంది