Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులితో పోరాడి కన్నబిడ్డను కాపాడుకున్న తల్లి.. ఎక్కడంటే?

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (22:08 IST)
నవమాసాలు మోసి.. కంటికి రెప్పలా కాపాడిన తల్లికి తన బిడ్డ ప్రమాదంలో వుండటం సహించలేకపోయింది. ఇంకా ఎదురుదాడికి దిగి తన బిడ్డను కాపాడుతుంది. తన ప్రాణాలకంటే తన బిడ్డను ప్రాణాలే ఆ తల్లి కాపాడాలని అనుకుంది. చివరకు ఆ ప్రమాదమే ఆతల్లి దాడికి తట్టుకోలేక వెనుతిరిగింది. ఆ ప్రమాదమే పులి. పులి తన బిడ్డను తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అది గమనించిన ఆ తల్లి ఆ పులితో పోరాడింది. 
 
గాయాలైనా సరే తన బిడ్డకోసం ఆపులినే ప్రతిఘటించింది. పులి పంజాన నుంచి తన పదిహేను నెలల బాలున్ని కాపాడుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్​ ఉమరియా జిల్లాలోని బాంధవ్​గఢ్​ టైగర్​ రిజర్వ్ ప్రాంతంలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. రోహ్​నియా గ్రామానికి చెందిన భోలా ప్రసాద్​, అర్చన దంపతులకు 15 నెలల కుమారుడు ఉన్నాడు. తన బిడ్డ రవిరాజును తీసుకుని కాలకృత్యాలకై పొలానికి తీసుకెళ్లింది అర్చన. అక్కడికి ఇంతలో వచ్చిన పులి, వారిపై దాడి చేసింది, బాలుడిని నోట్లో కరచుకుని వెళ్లబోయింది. 
 
దీంతో.. ఆ చిన్నారిని కాపాడే సమయంలో పులి అర్చననూ గాయపరిచింది. అయినా అర్చన అవేవీ లెక్కచేయకుండా గట్టిగా అరుస్తూ పులిని అడ్డుకుంది. దీంతో అర్చన కేకలు విని కొంత మంది గ్రామస్థులు అక్కడికి చేరుకుని పులిని చెదరగొట్టారు. అయితే.. గాయపడిన తల్లీ, కుమారుడిని వెంటనే మన్​పుర్​లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments