Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంపీలో వింత శిశువు.. కాళ్లకు బదులు కొమ్ములు..

Advertiesment
horn with baby
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (13:33 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత శిశువు జన్మించాడు. కాళ్లకు బదులు కొమ్ములు ఉన్నాయి. ఈ విచిత్ర శిశును చూసిన వైద్యులు.. అది అంగవైకల్యమని అంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివ్‌పురి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గర్భస్థ పిండంలో పెరుగుదల లేకపోవడం, పోషకాహార లోపం వల్ల ఇలాంటివి జరుగుతాయని తెలిపారు. ఈ పుట్టిన శిశువు కూడా కేజీన్నర మాత్రమే బరువు ఉండటంతో ఎస్.ఎన్.సి.యూకి తరలించారు. ఈ వింత శిశువుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
శివ్‌పురి జిల్లాలోని మణిపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత నెల 26వ తేదీన ఓ మహిళ కాళ్ళలేని వింత శిశువుకు జన్మనిచ్చింది. చేతులు, మిగతా అవయవాలు అన్నీ బాగానే ఉన్నప్పటికీ కాళ్లు ఉండాల్సిన స్థానంలో కొమ్ము ఆకారంలో అవయవం ఉంది. ఈ "మిరాకిల్ బేబీ"ని చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. 
 
పైగా, ఈ శిశువు బరువు కేవలం కేజీన్నర మాత్రమే ఉండటంతో ఎస్‌ఎన్‌సీయూ వార్డుకు తరలించారు. విచిత్ర వైకల్యంతో బాబు జన్మించినట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చెప్పారు.
 
మరోవైపు, విచిత్ర వైకల్యంతో శిశువు జన్మించిందన్న వార్త సోషల్ మీడియాకెక్కి వైరల్ కావడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. తల్లి గర్భంలో పిండం పూర్తిగా ఎదగకపోవడం వల్ల, పోషకాహారం సరిగా అందకపోవడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఎన్ఎస్ విక్రాంత్ జల ప్రవేశం - నవ భారత్‌కు కొత్త ఐడెంటిటీ