Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమిస్తున్న అమ్మాయి రాఖీ కట్టేందుకు వచ్చింది.. అంతే దూకేశాడు..

ప్రేమిస్తున్న అమ్మాయి రాఖీ కట్టేందుకు వచ్చింది.. అంతే యువకుడు భవనం నుంచి దూకేసింది. త్రిపుర రాజధాని అగర్తాలాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అగర్తాలాలో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు పాఠశాలలో

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (17:32 IST)
ప్రేమిస్తున్న అమ్మాయి రాఖీ కట్టేందుకు వచ్చింది.. అంతే యువకుడు భవనం నుంచి దూకేసింది. త్రిపుర రాజధాని అగర్తాలాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అగర్తాలాలో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు పాఠశాలలో దిలీప్ కుమార్ షా(18) అనే యువకుడు పన్నెండో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలకు చెందిన ఓ అమ్మాయిని దిలీప్ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి ఆమెతో దిలీప్‌కు రాఖీ కట్టించేందుకు యత్నించారు. యువతిని బలవంతంగా దిలీప్ వద్దకు తీసుకువచ్చి రాఖీ కట్టాలంటూ బెదిరించారు. దీంతో భయపడిపోయిన యువకుడు పాఠశాల భవనంలోని రెండో అంతస్తు నుంచి దూకేశాడు. దాంతో దిలీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 
 
దీన్ని గమనించిన వారు వెంటనే దిలీప్‌ను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలా అన్యాయంగా తమ కుమారుడిని బెదిరింపులకు పాల్పడిన టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లిదండ్రులు పాఠశాల ముందు నిరసనకు దిగారు. పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తర్వాతి కథనం
Show comments