'బంగారు' రాణికి ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగిన ప్రియుడు
జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల రెజ్లింగ్ పోటీల్లో భారత్‌కు బంగారు పతకం అందించిన మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్. ఈమె జకర్తా నుంచి స్వదేశానికి చేరుకుంది. ఆమె ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే ప
జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల రెజ్లింగ్ పోటీల్లో భారత్‌కు బంగారు పతకం అందించిన మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్. ఈమె జకర్తా నుంచి స్వదేశానికి చేరుకుంది. ఆమె ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే ప్రియుడు ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగి సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించాడు.
సోమ్‌వీర్ రాఠిని వినేష్ ఫోగాట్ ప్రేమిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో జకర్తా నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే, అక్కడే సోమ్‌వీర్ ఎంగేజ్‌మెంట్ రింగ్ ప్రెజెంట్ చేశాడు. ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లోనే రింగులు మార్చుకున్నారు. అదే రోజు వినేష్ తన 24వ పుట్టిన రోజు కూడా జరుపుకోవడం విశేషం.
సోమ్‌వీర్ రాఠి కూడా మాజీ జాతీయ స్థాయి రెజ్లర్. ఏడేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. వీళ్లు ఎయిర్‌పోర్ట్‌లో ఎంగేజ్‌మెంట్ రింగులు మార్చుకున్న సమయంలో వినేష్ పెదనాన్న మహావీర్ ఫొగాట్, సోమ్‌వీర్ తల్లి అక్కడే ఉన్నారు.
నిజానికి శనివారం ఆమె బర్త్ డే కావడంతో అదేరోజు ఎంగేజ్‌మెంట్ జరుపుకోవాలని సోమ్‌వీర్ భావించాడు. అయితే ఆమె ఎయిర్‌పోర్ట్ చేరుకునేసరికి రాత్రి కావడంతో సోమ్‌వీర్ అక్కడే ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగాడు.
గోల్డ్ మెడల్ గెలిచిన వినేష్‌కు ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. 50 కేజీల ప్రీస్టైల్ రెజ్లింగ్‌లో వినేష్ గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ గెలిచిన తొలి భారతీయ మహిళగా వినేష్ నిలిచింది.