Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్క తడుపుతున్నాడని.. బాలుడి మర్మాంగంపై వాతలు

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (10:10 IST)
బాలుడు పక్క తడుపుతున్నాడనే కారణంతో పైశాచికంగా ప్రవర్తించారు ఆ దుర్మార్గులు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారు.. బాలుడి పట్ల క్రూరంగా వ్యవహరించారు ఆ తల్లిదండ్రులు. ఇలా చేసిన ఓ వ్యక్తి, అతని రెండో భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. బాలుడి బయోలాజికల్ తల్లి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. థానేలోని వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన రెండో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు తన మొదటి భార్యకు పుట్టిన కొడుకును(9) తన వద్దే ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రోజు రాత్రి సమయంలో ఆ బాలుడు పక్క తడిపేస్తున్నాడని ఆగ్రహం తెచ్చుకున్నారు. తెలిసి తెలియక చేసిన తప్పుకు అతన్ని దారుణంగా కొట్టారు. బాలుడి మర్మాంగంపై వాతలు కూడా పెట్టి పశువుల్లా ప్రవర్తించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న బాలుడి అసలు తల్లి.. పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకుపై జరిగిన దాడి గురించి పోలీసులకు వివరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్ చేయలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments