Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఠాగూర్
గురువారం, 12 జూన్ 2025 (19:31 IST)
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది ఉన్నారు. వీరిలో 35 నుంచి 40 మంది మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అయితే, ఈ విమానంలో లోపం ఉన్నట్టు ముందే ఓ విమాన ప్రయాణికుడు సందేహం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా ఎయిరిండియా సంస్థకు సమాచారం కూడా చేరవేశాడు. 
 
అయితే, ఈ విమానం న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్‌కు చేరుకోవాల్సివుంది. ఆకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలో ఈ విమానం ఎక్కాడు. అతడు అహ్మాదాబాద్‌లో దిగిపోయాడు. ఆ క్రమంలో ఈ విమానంలో లోపం ఉందంటూ అతడు ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. 
 
మరోవైపు, యేడాది వ్యవధిలో ఇదే విమానంలో రెండుసార్లు సాంకేతిక సమస్య తలెత్తినట్టు సమాచారం. 2024 జూన్ 6 తేదీన, డిసెంబరు నెలలో ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్యపై ఎయిరిండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేఖ కూడా రాసింది. అయితే ఈ లేఖను ఎయిరిండియా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరించింది. చివరగా మూడోసారి అంటే జూన్ 12వ తేదీ గురువారం ఈ ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. పైగా ఈ విమానం చాలాకాలం నాటిగా గుర్తించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments