Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)

Advertiesment
flight crash

ఠాగూర్

, గురువారం, 12 జూన్ 2025 (15:49 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 110 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ విమాన ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లు కూడా. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీసు, ఒకరు కెనడా పౌరుడు ఉన్నట్టు ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే, ఆయన పరిస్థితి ఏంటన్నది తెలియాల్సివుంది. 
 
పైలెట్ల లోపమా? కుట్ర కోణమా? టేకాఫ్‌లో అవాంతరమా? 
 
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న సర్దార్ వల్లాభాయ్ పట్లే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు, 10 మంది విమాన సిబ్బందితో పాటు మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం లండన్‌కు బయలుదేరిన తర్వాత చెట్టును ఢీకొని కూలిపోయినట్టు ప్రాథమిక సమచారం. 
 
అయితే, ఈ విమానం వెనుక ఏదేని కుట్రకోణం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అదేసమయంలో విమానం పైలెట్ల వైపు నుంచి కూడా లోపం ఉందా అనేది తెలియాల్సివుంది. ముఖ్యంగా ఈ విమానం ప్రధాన పైలెట్‌కు 8200 గంటలపాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. దీంతో పైలెట్ పరంగా ఎలాంటి సమస్య ఉండే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఏదైనా కుట్రకోణం దాగివుందా? అనే కోణంలో విచారిస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పైలెట్ల లోపమా? కుట్ర కోణమా? టేకాఫ్‌లో అవాంతరమా?