Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి ఎంపీకి వీడని కష్టాలు... వారం రోజుల్లో కూల్చివేయాలంటూ...

Webdunia
శనివారం, 21 మే 2022 (19:36 IST)
మహారాష్ట్రలోని అమరావతి బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే హనుమాన్ చాలీసా పఠనంపై చెలరేగిన వివాదంలో అరెస్టు అయిన నవనీత్ కౌర్ దంపతులు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఇపుడు మరో కష్టం వచ్చిపడింది. 
 
ముంబై నగర పరిధిలోని ఖర్ ఏరియాలో నవనీత్ కౌర్ ఇంటిలో కొంతభాగం అక్రమంగా నిర్మించారంటూ ముంబై నగర పాలక సంస్థ ఆమెకు నోటీసులు జారీచేసింది. ఈ అక్రమ నిర్మాణాన్ని వారం రోజుల్లో కూల్చివేయాలని లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాలని డిమాండ్ చేసిన కౌర్‌ అందుకు ఆయన సమ్మతించకపోతే ఆయన ఇంటి ముందు బైఠాయించి హనుమాన్ చాలీసాను పఠిస్తానంటూ హెచ్చరికలు చేశారు. 
 
ఈ క్రమంలో సీఎం ఇంటికి వెళతారన్న అనుమానంతో కౌర్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ దంపతులకు పది రోజుల తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పది రోజుల పాటు వారు జైలు జీవితం గడిపారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments