దేశంలో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు

Webdunia
శనివారం, 21 మే 2022 (19:25 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. భగ్గుమంటున్న పెట్రోల్ ధరలను తగ్గించే దిశగా అడుగులు వేసింది. ఇందులోభాగంగా పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయివున్నాయి. అనేక రాష్ట్రాల్లో సెంచరీ క్రాస్ అయింది. పెట్రోల్ లీటర్ రూ.120 వరకు ఉండగా, డీజిల్ లీటర్ రూ.105 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తద్వారా లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 మేర తగ్గనుందని, లీటర్ డీజిల్ ధర రూ.7 మేర తగ్గనుందని వివరించారు. 
 
ఇటీవల మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 మధ్య కాలంలో పెట్రో ధరలను 14 సార్లు పెంచారు. తద్వారా లీటర్‌పై గరిష్ఠంగా రూ.10 వరకు పెరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులకు ఊరట కలగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments