Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న బ్లాక్ ఫంగస్.. హర్యానాలో 650కి పైగా కేసులు

Webdunia
సోమవారం, 31 మే 2021 (20:22 IST)
దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఓ వైపు.. మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు విజృంభిస్తున్నాయి. కరోనా కేసులతో పాటు రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండ‌టం అంధోళ‌న క‌లిగిస్తోంది. ఉత్తర భారత దేశంలోనే బ్లాక్ ఫంగ‌స్ కేసులు అధిక సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. హ‌ర్యానాలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో 650కి పైగా కేసులు న‌మోద‌వ్వ‌గా, 50 మందికి పైగా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.  
 
బ్లాక్ ఫంగ‌స్‌, క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో లాక్‌డౌన్‌ను మ‌రో వారం రోజుల పాటు పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  జూన్ 15 వ‌ర‌కు స్కూల్స్ మూసివేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మే 28 నాటికి దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో..12 వేల మందికి పైగా బ్లాక్‌ ఫంగస్‌ బారినపడినట్టు  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ… మే7, 2021న ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ మొదటి కేసు బయటపడింది. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిషా, తమిళనాడు రాష్ట్రాలలో రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పలు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ వ్యాధిని అంటువ్యాధుల జాబితాలో చేర్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments