Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (08:50 IST)
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఈ నెలాఖరులోగా కొత్త చీఫ్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఈ నెలాఖరున కొత్త అధ్యక్షుడు ఎంపిక జరుగనుంది. ఈ ఎన్నిక దాదాపు 10 నెలలుగా పెడింగ్‌లో ఉంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడుని ఎన్నుకోవాలని బీజేపీ భావిస్తోంది. వాస్తవానికి మార్చి 15వ తేదీ నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి వుంది. అయితే, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. 
 
కాగా, బీజేపీ ఇప్పటికే 13 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు ముగించి 13 మంది రాష్ట్ర అధ్యక్షులను పార్టీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ సహా మరికొన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను మరో వారం రోజుల్లో ప్రకటించాల్సి వుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడుని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. పార్టీ నియమావళి ప్రకారం బీజేపీ జాతీయ అధ్యక్షుడుని ఎన్నుకోవాలంటే 50 శాతం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాల్సివుంది. అంతకుమందు బూత్, మండల, జిల్లాస్థాయి ఎన్నికలు నిర్వహించాలి. 
 
కాగా, ప్రస్తుతం చీఫ్‌గా ఉన్న జేపీ నడ్డా గత 2019 నుంచి కొనసాగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆయన పదవీకాలాన్ని 2024 జూన్ వరకు పొడగించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో జాతీయ అధ్యక్షుడి ఎన్నికను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పార్టీ భావిస్తోంది. అయితే, బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అంత సులభం కాదు. అనేక సామాజిక, రాజకీయ సమీకరణాలను బేరీజు వేయాల్సివుంటుంది ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అగ్రనేతలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments