Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తింటే లైంగిక పటుత్వం తగ్గిపోతుంది.. వెస్ట్ బెంగాల్ మాజీ మంత్రి కామెంట్స్

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (16:37 IST)
ఇటీవలికాలంలో పలువురు రాజకీయ నేతలు తరుచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వారు నోటి దూల కారణంగానే ఇలా జరుగుతుంది. తాజాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు, ఆయన చేసిన పనికి ప్రతి ఒక్కరూ విస్తుపోయారు. బిర్యానీ తింటే లైంగిపటుత్వం తగ్గిపోతుందంటూ, బలవంతంగా బిర్యానీ సెంటర్లను మూసి వేయించి వివాదంలో చిక్కుకున్నారు. బిర్యానీలో ఉపయోగించే మసాలా వల్ల మగవారిలో లైంగిత పటుత్వం తగ్గుతోందని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గంలో పని చేసిన మాజీ మంత్రి రవీంద్రనాథ్ మాట్లాడుతూ, బిర్యానీ చేయడానికి ఉపయోగించే మసాలా దినుస్సులు, వాడే పదార్థాలలో మగవాళ్ళలో శృంగారంపై కోరికలు తగ్గటం చాలా మంది నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. 
 
బిర్యానీ చేయడానికి ఏ మసాలాలు ఉపయోగిస్తున్నారో తమకు తెలియదని, ఈ ప్రాంత ప్రజలు కొన్నాళ్ల నుంచి చెబుతున్నారని తెలిపారు. ఆ పదార్థాల వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారని వెల్లడించారు. 
 
బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఈ ప్రాంతంలో బిర్యానీ విక్రయిస్తున్నారని, లైసెన్సులు లేకుండా దుకాణాలు నడుపుతున్నారని, అందువల్ల అలాంటి దుకాణాలను మూసి వేయించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈయన కూచ్ బెహార్ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం