Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన లేడీ టీచర్, ఎందుకో తెలిస్తే షాకవుతారు?

liquor
, శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (12:08 IST)
విద్యార్థులను సన్మార్గంలో నడిపాల్సిన ఉపాధ్యాయురాలు ఒకరు చేయకూడని చేశారు. కేవలం 25 యేళ్లు వయసు కలిగిన ఈమె పీకల వరకు మద్యం సేవించి స్కూలుకు వచ్చారు. ఈ విషయాన్ని విద్యార్థులు కనిపెట్టి ఇతర ఉపాధ్యాయులకు చెప్పారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ ఘటన కర్నాటకలోని తుముకూరు తాలూకాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని తుముకూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక పాటశాలలో 25 యేళ్ళ గంగలక్ష్మమ్మ టీజరుగా పని చేస్తుంది. ఆమె ప్రతి రోజూ మద్యం సేవించి స్కూలు రావడం ఆనవాయితీగా మారింది. ఈ విషయాన్ని విద్యార్థులు కనిపెట్టారు. పైగా పాఠాలు చెప్పకపోగా, తరగతి గదిలో విద్యార్థులను చితకబాదేది. దీంతో విసిగిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు.. స్కూలుకు చేరుకుని పాఠశాలకు తాళం వేశారు. ఆపై గంగలక్ష్మమ్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
 
ఈ విషయం తెలిసిన తాలూకా విద్యాధికారి (బీఈవో) హనుమానాయక్‌కు గ్రామస్థులు పరిస్థితిని వివరించారు. దీంతో స్కూలు లోపలికి వెళ్లి ఉపాధ్యాయిని టేబుల్ డ్రా తెరిచేందుకు ప్రయత్నించగా ఆమె అడ్డుకున్నారు. చివరికి డ్రా తాళాలు పగలగొట్టి చూడగా అందులో ఓ మద్యం సీసాతోపాటు రెండు ఖాళీ సీసాలు కనిపించాయి. 
 
అందరి ముందు రెడ్ హ్యాండెండ్‌గా దొరికిపోయిన టీచర్ అవమానభారంతో గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. విషయం పోలీసులకు చేరడంతో వారొచ్చి మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, గంగలక్ష్మమ్మను బయటకు తీసుకొచ్చారు. ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజు పాలనలోకి బ్రిటన్ - క్వీన్ ఎలిజబెత్-2 పెద్ద కుమారుడికి పట్టాభిషేకం