Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో ముగిసిన తొలిదశ ప్రచారం : సీఎం నితీశ్ కుమార్‌పై చెప్పు!!!

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (15:47 IST)
బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. తొలి దశ పోలింగ్ ఈ నెల 28వ తేదీన 16 జిల్లాల్లో 71 అసెంబ్లీ స్థానాల్లో జరుగనుంది. 
 
ఈ దశ ఎన్నికల కోసం జేడీయూ అధినేత, సీఎం నితీశ్‌ కుమార్‌, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ఆయా నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, ఇరానీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు ఎన్డీయే తరుఫున ప్రచారం నిర్వహించారు. 
 
ఇక కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌ గాంధీ మహాకూటమి తరపున ప్రచారం చేశారు. అన్ని పార్టీలు తమ తమ ఎన్నికల హామీలు, ఇతర పార్టీలపై విమర్శలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాయి. నవంబర్‌ 3న రెండో దశ, 7వ తేదీన మూడో దశ పోలింగ్ జరుగుతుంది. అనంతరం నవంబర్‌ 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 
 
ఇదిలావుంటే, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నాయకులకు ఊహించని పరాభవాలు ఎదురయ్యాయి. మొన్న ఆర్జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్‌పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. సోమవారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అదే చేదు అనుభవం ఎదురైంది.
 
ముజఫర్ పూర్‌లో ఎన్నికల ర్యాలీని ముగించుకుని హెలికాప్టర్ వద్దకు వస్తుండగా కొందరు చెప్పులు విసిరారు. అయితే అవి ఆయనకు తగలలేదు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.
 
ఈ ఎన్నికల్లో నితీశ్‌కు అసహనం ఎక్కువవుతోంది. ఆయన సభలలో వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. దీంతో, నిరసనకారులపై నితీశ్ మండిపడుతున్నారు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ, ఓట్లు వేయకున్నా ఫర్వేదంటూ నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments