భర్తపై అనుమానం.. జిమ్‌లో మహిళను చితకబాదిన భార్య

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (12:53 IST)
భర్తతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అతడి భార్య ఓ మహిళపై వ్యాయామశాలలో బూట్లతో దాడికి దిగింది. పక్కనున్నవారు ఆపడానికి ప్రయత్నించినా శాంతించకుండా విచక్షణారహితంగా విరుచుకుపడింది. 
 
ఆమె ఎవరో తనకు తెలియదని భర్త ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. చివరికి భార్యాభర్తలిద్దరూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పరస్పరం కేసులు పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. 
 
ఈ నెల 15న జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 30 ఏళ్ల ఆ మహిళ బుర్ఖా ధరించి తన సోదరితో కలసి ఓ జిమ్‌కు వచ్చింది. అక్కడ వ్యాయామాలు చేస్తున్న భర్త పక్కన ఉన్న మహిళను చూసింది. 
 
భర్తతో ఆమెకు సంబంధం ఉందని అనుమానించింది. ఈ విషయమై అతడితో గొడవకు దిగి.. ఆ మహిళపై ఒక్కసారిగా దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments