Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాగిన మైకంలో భార్యను తుపాకీతో కాల్చిన భర్త.. చివరకు...

Advertiesment
Srikakulam
, ఆదివారం, 17 అక్టోబరు 2021 (11:30 IST)
అనుమానం పెనుభూతమైంది. దీనికితోడు పీకలవరకు మద్యం సేవించాడు. ఈ మైకంలో ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాలేదు. అంతే.. నాటు తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. దీంతో భార్య చనిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని భరణికోట కాలనీ అనే గిరిజన తండాలో వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భరణికోట కాలనీకి చెందిన జగ్గరావు, సవర పద్మ(33) అనే దంపతులు ఉండగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యపై అనుమానంతో జగ్గారావు లోలోన కుమిలిపోతున్నాడు. దీంతో ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ వచ్చాయి. 
 
ఈ క్రమంలో మద్యం తాగొచ్చి రోజూ వేధింపులకు పాల్పడతుండేవాడు. శనివారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అప్పటికే మత్తులో ఉన్న జగ్గరావు తన వద్దనున్న నాటు తుపాకీతో పద్మను కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.
 
కాగా గ్రామానికి చెందిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుధీర్ఘ అంతరిక్ష యాత్రకు చైనా శ్రీకారం - 183 రోజులు అక్కడే...