అప్పులు తెచ్చి పంచడమే ప్రభుత్వ పనా? : ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్న

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (12:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక నిపుణులతో పాటు... కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఘోరంగా తయారయిందని... పరిస్థితిని చూస్తుంటే చాలా బాధేస్తోందన్నారు. 
 
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైరయిన ఉద్యోగులకు పెన్షన్లు ఆలస్యంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. విశాఖ నగరంలో ప్రభుత్వ భూములు, ఆస్తులను తాకట్టు పెట్టే పరిస్థితిని మనం చూస్తున్నామన్నారు. 
 
ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలన్నారు. సామర్థ్యం ఉన్న నాయకుడు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగిపోయాయని... వీటన్నింటిని ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. అప్పులు తీసుకురావడం... వాటిని పంచడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేసే పని అప్పులు తెచ్చి పంచడమేనా? అని ప్రశ్నించారు. ఎంతకాలం అప్పులు పుడతాయని అడిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments