Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంతంగా భారత్​ బంద్... కండువాతో ఒక పైప్‌కు ఉరివేసుకున్న రైతు

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (19:56 IST)
Bharat bandh
దేశవ్యాప్తంగా భారత్​ బంద్ ప్రశాంతంగా ముగిసింది.​ తమ పోరాటానికి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్​ ప్రభావం ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపించింది. దిల్లీలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. దిల్లీ- గురుగ్రామ్​ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
 
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రైతులు రైల్వే ట్రాక్​లపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. పంజాబ్‌-హరియాణా సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిని రైతులు దిగ్భందించారు. హరియాణా రోహ్‌తక్‌, కర్నాల్‌ ప్రాంతాల్లోనూ ట్రక్కు, ద్విచక్ర వాహనాలను నిలిపి రాకపోకలను రైతన్నలు అడ్డుకున్నారు.దక్షిణ భారతంలో తమిళనాడు, కేరళలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. కర్ణాటకలో మాత్రం బంద్ పాక్షికంగా సాగింది.
 
మరోవైపు రైతుల 'భారత్‌ బంద్‌' నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లుధియానాకు చెందిన 65 ఏళ్ల వృద్ధ రైతు గత పది నెలలుగా గులాల్ టోల్‌ ప్లాజా వద్ద నిరసన చేస్తున్నాడు. అయితే 'భారత్‌ బంద్‌'కు కొన్ని గంటల ముందు ఆయన బలవన్మరణం చెందాడు. లుధియానాలోని నిరసన ప్రాంతానికి సమీపంలో మెడలో వేసుకున్ని కండువాతో ఒక పైప్‌కు ఉరి వేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments