Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడు ముంబై సిటీ కంటే.. జైలే ఉత్తమం : నిందితుడికి బెయిల్ నిరాకరించిన జడ్జి

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (20:27 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఉండటం కంటే.. జైల్లో ఉండటమే ఉత్తమమంటూ ఓ నిందితుడి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు జడ్జి నిరాకరించారు. ఈ ఘటన బాంబేలో జరిగింది. ఈ వివరాలను స్పందిస్తే, ముంబైలోని సబర్బన్‌ ఘట్కోపర్‌ ఏరియాకు చెందిన జితేంద్ర మిశ్రా ఓ హత్య కేసులో జైలు పాలయ్యాడు. నవీ ముంబైలోని తలోజా జైలులో గత 18 నెలల నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు.
 
అయితే నిందితుడు మిశ్రా తాత్కాలిక బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ జీఎస్‌ పటేల్‌ గురువారం విచారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై సిటీ కంటే జైలే ఉత్తమం అని నిందితుడికి జడ్జి సూచించారు. 
 
బయట కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉందని, జైల్లోనే క్షేమంగా ఉండాలని నిందితుడికి జడ్జి చెప్పారు. ముంబై సిటీలో ఏం జరుగుతోందో నీకు తెలియనట్లు ఉందని నిందితుడిని ఉద్దేశించి జీఎస్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు. బయటి కంటే జైల్లోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. 
 
సాధ్యమైన చోట ఖైదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి తెలుసునని, అయితే నగరంలోని పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని బాంబే హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.
 
ప్రస్తుతం ముంబైలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నిందితుడిని విడుదల చేయడానికి కుదరదు అని కోర్టు తెలిపింది. ముంబైలోని అనేక ప్రాంతాలు కరోనా వైరస్ వ్యాప్తికి హాట్ స్పాట్లుగా మారాయని పేర్కొంది. ఇప్పుడు మిశ్రాను విడుదల చేస్తే కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments