అమెరికన్లు భవిష్యత్తులో ఇంకెప్పుడూ షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదని అమెరికాకు చెందిన శాస్త్రవేత్త అంటువ్యాధుల నిపుణుడు ఆంథోని ఫాసీ సూచించారు. దీనివల్ల అమెరికాలో కరోనా వ్యాప్తిని అరికట్టడంతో పాటూ ఇన్‌ఫ్లుయెంజా కేసుల సంఖ్య కూడా బాగా తగ్గించవచ్చన్నారు.
అమెరికన్లు ఇక సంప్రదాయాలను పక్కనబెట్టాల్సిందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అమెరికన్లు ఇంకెప్పుడూ షేక్ హ్యాండ్లు ఇవ్వకూడదని ఇటీవల వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మనం చేతులు కలపడం అనే సంప్రదాయానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని పిలుపు నిచ్చారు.
అసలు ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఎందుకంటే దీని ద్వారానే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఫాసీ తెలిపారు. చేతులు కలపడం అనేది అమెరికా కల్చర్‌లో ఓ ముఖ్య భాగం. అయితే అమెరికా అధ్యక్షుడు కూడా ఈ షెక్ హ్యాండ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టే విషయమై ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో ప్రజలు దీనిపై అంతగా ఆశక్తి చూపకపోవచ్చేమోనని చెప్పారు.