Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాఫీ అడిగితే ఇవ్వని భార్య.. వేడి నీళ్లు పోసేసిన భర్త.. ఎక్కడ?

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (22:13 IST)
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మహిళలపై గృహ హింసలు పెరిగిపోతున్నాయి. తాజాగా భార్య కాఫీ పెట్టివ్వలేదని ఓ భర్త.. ఆమెపై వేడినీరు పోసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు శివారు ప్రాంతమైన తొట్టప్పళపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న పారిశ్రామిక వేత్త భార్య కావ్య (34). 
 
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా కుటుంబంతో ఇంట్లోనే వుంటున్నారు. ఈ నేపథ్యంలో కావ్యతో ఆమె భర్త కాఫీ పెట్టివ్వమని అడిగాడు. కానీ కావ్య కాఫీ పెట్టివ్వడం కుదరదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె భర్త ఆవేశంలో వేడినీటిని కావ్యపై పోసేశాడు. 
 
వేడి తట్టుకోలేక కేకలు పెట్టిన కావ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అదృష్టకరంగా కావ్య తేలికపాటి గాయాలతో కోలుకుంది. దీనిపై కావ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కావ్య భర్తపై చర్యలు తీసుకునేందుకు విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments