Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొమ్మ తుపాకీ తల్లిని ఆస్పత్రి పాలు చేసింది.. ఎలా?

బొమ్మ తుపాకీ అనుకుని తల్లిని ఓ కూతురు కాల్చేసిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రం హూగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హూగ్లీ జిల్లాలో అరంబాగ్‌లోని కనకుల్ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వ

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (11:59 IST)
బొమ్మ తుపాకీ అనుకుని తల్లిని ఓ కూతురు కాల్చేసిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రం హూగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హూగ్లీ జిల్లాలో అరంబాగ్‌లోని కనకుల్ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారి ఇంటి పక్కన పార్క్ ఉంది. ఆదివారం కావటంతో కూతురు కకోలి జనతో కలిసి పార్క్‌కు వెళ్లింది తల్లి. అక్కడ కకోలి తల్లికి ఓ తుపాకీ దొరికింది. 
 
కానీ అది బొమ్మ పిస్టోల్ అనుకున్న తల్లి.. దాన్ని ఆడుకోవాల్సిందిగా కూతురికి ఇచ్చింది. ఆ తుపాకీని ఇంటికి తీసుకొచ్చిన చిన్నారి.. తుపాకీతో అమ్మను బెదిరిస్తూ అల్లరి చేస్తోంది. అయితే ఉన్నట్టుండి తుపాకీ పేలింది. 
 
ఓ తూటా తల్లి వెనక భాగంలోకి దూసుకెళ్లింది. పెద్ద శబ్ధంతో తుపాకీ పేలటం.. కళ్లెదుట తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కుమార్తె షాక్ అయ్యింది. చుట్టుపక్కల వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అరంబాగ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్తున్నారు. ఆమెకు తగిన వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తుపాకీ పార్కులోకి ఎలా వచ్చిందనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఆ గన్‌లో ఆరు బుల్లెట్లు ఉన్నాయని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments