Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'శృంగార టాయ్స్' కొనుగోలులో భాగ్యనగరి వాసుల అమితాసక్తి

స్త్రీపురుషుల మధ్య జరిగే శారీరక శృంగారం కంటే సెక్స్ టాయ్స్‌ ద్వారా సంతృప్తి తీర్చుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ తరహా బొమ్మలను కొనుగోలు చేసేందుకు భాగ్యనగరివాసులు అమితాసక్తిని చూపుతున్నారు.

'శృంగార టాయ్స్' కొనుగోలులో భాగ్యనగరి వాసుల అమితాసక్తి
, సోమవారం, 11 డిశెంబరు 2017 (09:26 IST)
స్త్రీపురుషుల మధ్య జరిగే శారీరక శృంగారం కంటే సెక్స్ టాయ్స్‌ ద్వారా సంతృప్తి తీర్చుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ తరహా బొమ్మలను కొనుగోలు చేసేందుకు భాగ్యనగరివాసులు అమితాసక్తిని చూపుతున్నారు. ఫలితంగా సెక్స్ టాయ్స్ కొనుగోలులో హైదరాబాద్ ఆరోస్థానంలో ఉంది. 
 
వాస్తవానికి గతంలో శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడేవారు. అలాంటిది ఇప్పుడు లైంగిక 'తృప్తి' కోసం ఏకంగా సెక్స్‌టాయ్స్‌ను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఈ సెక్స్‌టాయ్స్‌ కొనుగోళ్లలో హైదరాబాద్‌ నగరం దేశంలోనే ఆరోస్థానంలో ఉండటం గమనార్హం. మన దేశంలో శృంగారపు బొమ్మలను విక్రయించే ఓ ఆన్‌లైన్‌ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో వెలుగుచూశాయి.
 
సెక్సు ఉత్పత్తుల కోనుగోళ్లలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా టాప్‌ 5లో మూడు దక్షిణాది రాష్ట్రాలు ఉండటం గమనార్హం. ఇటీవలికాలంలో మనదేశంలో సెక్స్‌ టాయ్స్‌ వాడకం బాగా పెరిగిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సెక్స్‌ టాయ్స్‌ కొంటున్న వారిలో 62 శాతం పురుషులు కాగా.. 38 శాతం మహిళలట. 
 
ఈ తరహా బొమ్మలను కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే, మెట్రో నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే తర్వాతి స్థానాల్లో ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, పుణె, అహ్మదాబాద్‌ నగరాలు ఉన్నాయి. 
 
ఇకపోతే, మగవారిలో 62 శాతం మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాత నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సెక్స్‌ ప్రోడక్ట్స్‌ కోసం ఆర్డర్లు ఇస్తుండగా.. ఆడవారిలో 38 శాతం మంది ఉదయం 10 నుంచి రాత్రి ఒంటి గంట మధ్యలో చేస్తారట. బరోడ, పుణె, తిరువనంతపురాల్లోని మహిళలు పురుషుల కంటే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తేలింది! ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో గడిచిన ఏడాది కాలంలో ఈ ఉత్పత్తుల అమ్మకాలు 25 శాతానికి పైగా పెరిగాయట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటర్నెట్ టెక్నాలజీతో ఇంటీరియల్ వాల్‌పేపర్స్ డిజైనింగ్