Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘దంగల్' నటికి విమానంలో లైంగిక వేధింపులు... (వీడియో)

‘దంగల్' నటి జైరా వాసీం (17)కు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. విస్టారా ఎయిర్ లైన్స్‌లో జైరాను ఓ ప్రయాణీకుడు వేధించాడు. ఢిల్లీ - ముంబై ఫ్లైట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertiesment
‘దంగల్' నటికి విమానంలో లైంగిక వేధింపులు... (వీడియో)
, ఆదివారం, 10 డిశెంబరు 2017 (11:00 IST)
‘దంగల్' నటి జైరా వాసీం (17)కు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. విస్టారా ఎయిర్ లైన్స్‌లో జైరాను ఓ ప్రయాణీకుడు వేధించాడు. ఢిల్లీ - ముంబై ఫ్లైట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణమైన అనుభవంపై తన ఆవేదనను ఆమె ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ వివరాలను తెలిపారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, తాను ఎయిర్ విస్తారా విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తుండగా.. తన సీటుకు ఉన్న ఆర్మ్ రెస్ట్‌పై తన వెనుక కూర్చున్న ప్రయాణికుడు కాలు పెట్టాడని జైరా వాసీం వెల్లడించారు. దీనికి తాను అభ్యంతరం తెలిపానన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటం వల్ల తన కాలును అక్కడ పెట్టానని అతను చెప్పాడని తెలిపారు.
 
అనంతరం తాను నిద్రపోతున్న సమయంలో తన మెడపై ఆ వ్యక్తి తన కాలితో తడిమాడని, ఆ విషయాన్ని తాను గ్రహించిన తర్వాత, ఆ దృశ్యాన్ని రికార్డు చేయడానికి ప్రయత్నించానని చెప్పారు. అయితే విమానంలో కాంతి తక్కువగా ఉన్నందువల్ల ఆ భయానక దృశ్యాలను రికార్డు చేయలేకపోయానన్నారు. కానీ కొంతవరకు ఆ దుర్మార్గుడి దుశ్చర్యను రికార్డు చేయగలిగినట్లు తెలిపారు. 
 
తన మెడ, భుజంపై ఆ వ్యక్తి తన కాలితో తడమటం దాదాపు 5 నుంచి 10 నిమిషాలపాటు కొనసాగినట్లు తెలిపారు. ఈ విధంగా జరిగి ఉండవలసినది కాదని జైరా మనోవేదనతో చెప్పారు. మహిళలను పరిరక్షించేది ఈ విధంగానేనా? అంటూ నిలదీశారు. ఎవరినీ ఈ విధంగా చేయకూడదన్నారు. ఇది చాలా దారుణమని, భయానకమని అన్నారు. విస్తారా విమాన సిబ్బంది కూడా తనకు సహాయం చేయడంలో విఫలమయ్యారని జైరా ఆరోపించారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంగస్థలం 1985 ఫోటోస్.. ఫస్ట్ లుక్‌లో చెర్రీ ఊరా మాస్