Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంతో ఎన్ని ప్రయోజనాలో...

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (08:54 IST)
బెల్లం తినడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే దాన్ని వదిలిపెట్టారు. బెల్లం తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుందని సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు.

ఇక దీని ద్వారా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని, బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి, మెటబొలిజంని క్రమబద్దీకరణ చేస్తుందని అంటున్నారు. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుందని సూచిస్తున్నారు. ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలని అంటున్నారు.
 
బెల్లంలో వుండే ప్రముఖ ధాతువు ఇనుము. కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమై౦దని సూచిస్తున్నారు. చర్మం కోసం, బెల్లం రక్తంలోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి చర్మానికి మంచి మెరుపు నిచ్చి మొటిమలుని నివారిస్తుందని. బెల్లం యొక్క గుణం వేడిచేయడం కావున దీనిని మనం జలుబు ,దగ్గు, రొంప లాంటి వాటికి ఉపశమనం ఇస్తుంద౦టున్నారు.

జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డులో కూడా వాటిని కలిపి సేవించవచ్చని సూచిస్తున్నారు. శక్తి కోసం, బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే, బెల్లం సేవించినట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదని చెప్తున్నారు.
 
రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసట గా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయమని చెప్తున్నారు. బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుందని చెప్తున్నారు. దీని ఆంటి అలెర్జీక్ తత్వం వలన దమ్ము, ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయని సూచిస్తున్నారు.

మోకాళ్ళ నొప్పులకి విశ్రాంతి, బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయని. బెల్లంతో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియు మాట హయిగా వస్తాయ౦టున్నారు. బెల్లాన్ని నల్ల నువ్వులతో పాటు లడ్డు చేసుకోని, తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదని చెప్తున్నారు.

శీతకాలంలో నంజు బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకుని తినేయమని చెప్తున్నారు. బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకొంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుందని వివరిస్తున్నారు. భోజనము తర్వాత బెల్లం తీసుకొంటే అసిడిటీ తగ్గిపోతుందని వివరిస్తున్నారు.

ఐదు గ్రాముల శొంఠి, పది గ్రాముల బెల్లం ఉండలుగా చేసి తీసుకొంటే జాండిస్ (పీలియావ్యాధి) పచ్చ కామెర్లు వారికి లాభసాటిగా ఉంటుందని. బెల్లం హాల్వా తీసుకొంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందని, అయిదు గ్రాముల బెల్లం అంతే పరిమాణంలోని ఆవాల నూనె( మస్తర్డ్ ఆయిల్) తో కలిపి తీసుకొంటే శ్వాస సంభందిత వ్యాధులు నయమవుతాయని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments