Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 23 March 2025
webdunia

చెన్నై, ముంబై తెలుగువారికి కేసీఆర్ శుభవార్త!

Advertiesment
చెన్నై, ముంబై తెలుగువారికి కేసీఆర్ శుభవార్త!
, శుక్రవారం, 27 డిశెంబరు 2019 (08:45 IST)
చెన్నై, ముంబై, నాగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కీలక గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర రాజధాని ముంబై, ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నైలోని తెలుగువారికి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ గుడ్ న్యూస్ వినిపించారు.

హైదరాబాద్‌లోని వివిధ డిపోల నుంచి నేరుగా చెన్నై, నాగపూర్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ఈ రవాణ సదుపాయాలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ అధికారులకు స్పష్టం చేశారు.

తెలంగాణ ఆర్టీసీపై ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ, ఇడిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్టీసీని కాపాడడానికి, లాభాల బాట పట్టించేందుకు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ఉద్యోగులు కూడా తగిన స్పూర్తితో, చిత్తశుద్ధితో తమ బాధ్యతలు నిర్వర్తించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

రాబోయే పది రోజుల పాటు ఆర్టీసీ ఇడిలు, ఉన్నతాధికారులు డిపోల వారీగా సమావేశాలు నిర్వహించి, ఎక్కడికక్కడ తగిన వ్యూహం రూపొందించాలని చెప్పారు. పెళ్లిళ్లు, విహార యాత్రలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చే విషయంలో సరళమైన విధానం అనుసరించాలని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరవరరావు సీడీల్లో ఏముంది?.. ఎఫ్‌బీఐను ఆశ్రయించిన పోలీసులు