Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో యువతిని అమ్మేశారు.. పెళ్లయ్యాక లాక్కెళ్లిపోయారు..?

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై కామాంధులు ఓ వైపు రెచ్చిపోతుంటే.. మరోవైపు యువతులను బజారులో వస్తువులా అమ్మేస్తున్నారు. తాజాగా యూపీలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జ

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (15:41 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై కామాంధులు ఓ వైపు రెచ్చిపోతుంటే.. మరోవైపు యువతులను బజారులో వస్తువులా అమ్మేస్తున్నారు. తాజాగా యూపీలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే? యూపీలో ఓ యువతిని దారుణంగా అమ్మకానికి పెట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ యూపీలోని బాగ్‌పత్ జిల్లా, సురోర్‌పూర్ కలాన్ గ్రామంలో ఓ యువతిని కొందరు ఏజెంట్లు అమ్మేశారు. ఈ నెల 16న  ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటుక బట్టీలో కూలీగా పనిచేసే ముకేష్ అనే వ్యక్తికి సదరు యువతిని రూ.22 వేలకు ఇద్దరు బ్రోకర్లు వేలంపాటలో విక్రయించారు. అడ్వాన్సు కింద ముకేష్ వారికి రూ.17,500 చెల్లించి తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 
 
కానీ మిగిలిన మొత్తాన్ని అతను చెల్లించకపోవడంతో.. యువతిని బ్రోకర్లు లాక్కెళ్లిపోయారు. ఇలా పెళ్లి చేసుకున్న యువతి ఆచూకీ తెలియరాకపోవడంతో మనస్తాపానికి గురైన ముకేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముకేశ్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. 
 
ముకేష్ కేసును విచారిస్తుండగా యువతి వేలంపాట విక్రయ ఘటన తమ దృష్టికి వచ్చిందని బాగపత్ సర్కిల్ అధికారి దిలీప్ సింగ్ చెప్పారు. అలాగే ముకేష్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్టవిరుద్ధంగా వధువుల అక్రమ రవాణా, విక్రయం కిందం ఇద్దరు ఏజెంట్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments