Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చదువుకున్న చనువుతో బెదిరించి డబ్బు గుంజి.. ఆపై అత్యాచారం.. ఎక్కడ?

చదువుకున్న చనువుతో ఓ కామాంధుడు ఓ యువతిని బెదిరించి డబ్బు గుంజి.. ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒకటి హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఆ కామాంధుడిని షీ టీమ్స్ గుర్తించి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశ

చదువుకున్న చనువుతో బెదిరించి డబ్బు గుంజి.. ఆపై అత్యాచారం.. ఎక్కడ?
, బుధవారం, 14 మార్చి 2018 (14:30 IST)
చదువుకున్న చనువుతో ఓ కామాంధుడు ఓ యువతిని బెదిరించి డబ్బు గుంజి.. ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒకటి హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఆ కామాంధుడిని షీ టీమ్స్ గుర్తించి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన ఆర్. రవి(31) గతంలో నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పదో తరగతి చదివాడు. ఆ సమయంలో అదే పాఠశాలలో చదువుతున్న బాలికతో చనువుగా ఉండేందుకు ప్రయత్నించగా నిరాకరించింది. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో నివశిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె ఫోన్ నంబరును సంపాదించిన రవి... ఆమెకు ప్రతిరోజు ఫోన్‌ చేసి తనతో తరచూ ఫోన్‌లో మాట్లాడాలని వేధించడం మొదలుపెట్టాడు. పదో తరగతి చదివే సమయంలో ఆమెకు తెలియకుండా తీసిన నగ్న ఫొటోలను ఆమె సెల్‌ఫోన్‌కు పంపించాడు. తన దగ్గర మరిన్ని ఫొటోలు ఉన్నాయని వాటిని నీ భర్తకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో దిక్కుతోచని ఆమె అతని ఫోన్‌ నెంబరు బ్లాక్‌ చేసింది. అతను మరో ఫోన్‌ నెంబరుతో వేధించడం మొదలు పెట్టాడు. 
 
తనను ఇబ్బంది పెట్టవద్దని ఆమె రవిని ప్రాధేయపడింది. కనికరించని రవి తనకు డబ్బులు ఇస్తే ఫొటోలు డిలీట్‌ చేస్తానని అన్నాడు. ఆమె తన భర్తకు తెలియకుండా రవికి రూ.2.50 లక్షలు ఇచ్చింది. అయినా ఫొటోలు డిలీట్‌ చేయలేదు. అంతేగాక తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని లేకపోతే నీ భర్తను చంపి పిల్లలను కిడ్నాప్‌ చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. 
 
ఈ యేడాది జనవరి 18వ తేది కల్వకుర్తిలోని హనుమాన్‌ దేవాలయం వద్దకు వస్తే నీకు సంబంధించిన నగ్న ఫొటోలన్ని నీముందే సెల్‌ఫోన్‌లో డిలీట్‌ చేస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి ఆమె చెప్పిన సమయానికి అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను కొట్టి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా అతను నగ్నఫోటోలను డిలీట్ చేయలేదు. దీంతో బాధితురాలు నేరుగా షీ టీమ్స్‌ను సంప్రదించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడుని అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీఎంవోలో విజయసాయిరెడ్డి.. మీడియాను చూసి పరుగో పరుగు.. ఎందుకు?