Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేతలు వ్యతిరేకించే ఆహారాన్నే వాజ్‌పేయి ఇష్టంగా తినేవారు : గోవా పీసీసీ చీఫ్

గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (పీసీసీ చీఫ్) గిరిష్ ఛోడాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతలు ఏ ఆహారాన్నైతే తినొద్దంటూ దాడులు చేస్తున్నారో ఆ ఆహారాన్నే మాజీ ప్రధ

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (10:27 IST)
గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (పీసీసీ చీఫ్) గిరిష్ ఛోడాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతలు ఏ ఆహారాన్నైతే తినొద్దంటూ దాడులు చేస్తున్నారో ఆ ఆహారాన్నే మాజీ ప్రధాని వాజ్‌పేయి అమిత ఇష్టంగా ఆరగించేవారనీ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన పనాజీలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్న ఆహారాన్ని మాజీ ప్రధాని వాజపేయి ఎంతో ఇష్టంగా తినేవారని చెప్పారు. నిజానికి వాజ్‌పేయి మరికొన్ని సంవత్సరాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నట్టయితే దేశ ముఖచిత్రం మరోలా ఉండేదన్నారు. 
 
ఇపుడు మతం పేరుతో ప్రజల్ని విభజించే చర్యలను ఆయన అడ్డుకునేవారు. ప్రజలు ఏం తినాలి.. ఏం తినకూడదు అంటూ ఆదేశించే వ్యక్తుల ఆటలను వాజపేయి ఏ మాత్రం సాగనిచ్చేవారు. ప్రస్తుతం ఏదైతే తినకూడదని వీళ్లు (బీజేపీ) చెబుతున్నారో.. వాటిని ఆయన ఇష్టపూర్వకంగా తినేవారు. తాను ఏం తింటున్నాననే విషయాన్ని ధైర్యంగా ఆయన చెప్పుకునేవారు అని గిరిష్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments