Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ చింతన్ శిబిర్

Webdunia
మంగళవారం, 10 మే 2022 (07:42 IST)
కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పునరుత్తేజం కల్పించే దిశగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆమె పార్టీ శ్రేణులను, నేతలను సమాయాత్రం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉదయ్‌పూర్ వేదికగా చింతన్ శిబిర్‌ను నిర్వహించతలపెట్టింది. ఈ చింతన్ శిబిర్ సన్నాహాలపై సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. 
 
ఇందులో సోనియా గాంధీ కీలక ప్రసంగం చేశారు. పార్టీ పునరుజ్జీవానికి సంబంధించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికీ మేలు చేసిందనీ, ఆ రుణాన్ని తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ దిశగా పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఫలితాలు వాతంటత అవే వస్తాయని ఆమె చెప్పారు. 
 
ఈ నెల 13వ తేదీ నుంచి జరిగే చింతన్ శిబిర్‌ను ఏదో మొక్కుబడి సమావేశంగా భావించరాదని పార్టీ పునరుజ్జీవం దిశగా అడుగులు వేసే కీలక సమావేశంగా గుర్తించాలని సోనియా గాంధీ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments