Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌ ఎన్నికలు.. రికార్డు స్థాయిలో 74.96 శాతం ఓటింగ్ నమోదు

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2023 (10:00 IST)
రాజస్థాన్‌లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 74.96 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం పోలింగ్ డేటాను ప్రకటించారు. పోలింగ్ స్టేషన్లలో 74.13 శాతం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ద్వారా పోలైన 0.83 శాతం ఓట్లు ఉన్నాయి.
 
పోకరన్‌లో అత్యధికంగా 87.79 శాతం ఓటింగ్ నమోదైంది. తిజారాలో 85.15 శాతం ఓటింగ్ నమోదై రెండో స్థానంలో ఉంది. అత్యల్ప ఓటింగ్ శాతం ఉన్న మార్వార్ జంక్షన్‌లో 61.10 శాతం, అహోర్‌లో 61.19 శాతం ఓటింగ్ నమోదైందని పోల్ అధికారులు తెలిపారు. 
 
రాష్ట్రంలోని 199 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ (75) మృతి చెందడంతో శ్రీ కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గానికి శనివారం పోలింగ్ జరగలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments