Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : సిరిసిల్లా అసెంబ్లీ స్థానం రౌండప్

ktramarao
, శుక్రవారం, 24 నవంబరు 2023 (10:34 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో రాజన్న సిరిసిల్ల అసెంబ్లీ స్థానం ఒకటి. పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉంది. 1987లో సిరిసిల్ల పురపాలక సంఘంగా ఏర్పడింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో పవర్ లూమ్‌లు, టెక్స్‌టైల్ ప్రాసెసింగ్, డైయింగ్ యూనిట్లు ఉన్నందున దీనిని టెక్స్‌టైల్ టౌన్‌గా కూడా పిలుస్తారు. 40,000 పవర్ లూమ్‌లతో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద టెక్స్‌టైల్ హబ్‌గా ఉంది. విశాలాంధ్ర ఉద్యమ సమయంలో తెలంగాణలో మొదటి విశాలాంధ్ర మహాసభ సిరిసిల్లలోనే జరిగింది.
 
ఈ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం 2023లో సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటుచేసింది. పట్టణంలోని రెండో బైపాస్‌ రోడ్డులో 30 ఎకరాల్లో కళాశాల నిర్మాణం జరిగింది. 2023 సెప్టెంబరు 15న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు వైద్య కళాశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. 2023 సెస్టెంబరు 15న ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. గత 2018లో జరిగిన ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.  
 
కల్వకుంట్ల తారక రామరావు 125213
కొండం కరుణ మహేందర్ రెడ్డి 36204
ఆవునూరి రమాకాంత్ 3245
మల్లుగారి నర్సా గౌడ్ 3243
నోటా 2321
కోడూరి బాల లింగం 1922
తక్కల కిరణ్ 978
బోయిన్‌పల్లి శ్రీనివాస్‌ 961
అల్వాలా కనకరాజు 628
కరింగుల యాదగిరి 472
దోసల చంద్రం 468
కూరపాటి రమేష్ 443
గౌతా గణేష్ 279
చౌటపెల్లి వేణుగోపాల్ 253 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయుధ పోరాటనికి ఊతమిచ్చిన స్థానం జనగామ రౌండప్