Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ఎన్నికలు : ఓటేసిన రజనీ - కమల్ - స్టాలిన్

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (08:18 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 234 స్థానాలకూ ఒకే దశలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 
 
ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
 
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ థౌజండ్‌లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీస్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ కుమార్తెలు అక్షర హాసన్, శ్రుతి హాసన్‌లతో కలిసి చెన్నైలోని తైనంపేట, ఎల్డమ్స్ రోడ్డులో ఉన్న హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 
అలాగే, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, పుదుచ్చేరిలోనూ మంగళవారం ఎన్నికలు జరగుతుండగా, అసోం, పశ్చిమ బెంగాల్‌లలో మూడో విడత  పోలింగ్ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments