Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒళ్ళు గగుర్పొడిచే దారుణం : బాలిక మృతదేహంపై సైకో అత్యాచారయత్నం

Webdunia
ఆదివారం, 24 మే 2020 (10:23 IST)
కామాంధుల వికృత చర్యలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. అనుమానాస్పదంగా చనిపోయిన ఓ బాలిక మృతదేహాన్ని పాతిపెట్టారు. ఈ డెడ్ బాడీని వెలికితీసి.. దానిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో సైకో కామాంధుడు. ఈ దారుణం అస్సా రాష్ట్రంలోని ధీమాజీ జిల్లాలో జరిగింది. 
 
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వివరాలను పరిశీలిస్తే, శీలాపథార్ పట్టణానికి చెందిన అకన్ సైకియా అనే 50 ఏళ్ల వ్యక్తి 2019 సెప్టెంబరులో భార్యను వేధించిన కేసులో జైలుకెళ్లాడు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కోర్టు ఉత్తర్వుల మేర అకన్ సైకియాను జైలు అధికారులు బెయిలుపై విడుదల చేశారు. 
 
శీలాపథార్ పట్టణానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఆమె మృతదేహాన్ని ఈ నెల 17వతేదీన సీమెన్ నది తీరంలో ఖననం చేశారు. ఈ నెల 18వతేదీన అకన్ సైకియా సమాధిని తవ్వి బాలిక మృతదేహాన్ని బయటకు తీసి, మృతదేహంపై అత్యాచారయత్నం చేశాడు. 
 
నదీ తీరంలో బాలిక మృతదేహంపై అత్యాచార యత్నం చేస్తుండగా, చేపలు పట్టేందుకు వచ్చిన మత్స్యకారులు చూసి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడు అకన్ సైకియాపై ఐపీసీ సెక్షన్ 306, 377, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు. 
 
నిందితుడు ఆకన్ సైకియా మానసిక స్థితి బాగానే ఉందని, అతని భార్య ఫిర్యాదు మేర గతంలో అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించగా బెయిలుపై వచ్చి ఈ పనిచేశాడని పోలీసులు చెబుతున్నారు. 
 
కాగా అకన్ సైకియా బాలికను లైంగికంగా వేధించినందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆత్మహత్య  చేసుకున్నాక కూడా మృతదేహాన్ని కూడా వదలకుండా దాన్ని వెలికితీసి అత్యాచార యత్నం చేశాడని ప్రజల్లో వదంతులు వ్యాపించడంతో తాము దీనిపై దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ ప్రదీప్ కొన్వార్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం