Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విమాన ప్రయాణికులకు ఎయిరిండియా బంపర్ ఆఫర్...

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (11:35 IST)
రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విమానంలో ప్రయాణించిన ప్రయాణికులకు ఎయిరిండియా సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణంలో అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నట్టు ప్రకటించడమేకాకుండా, ప్రయాణ ఛార్జీని మొత్తం రీఫండ్ చేస్తామని తెలిపింది. ఇటీవల ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఇటీవల రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయంతెల్సిందే. 
 
అయితే, ఆ తర్వాత మరో ప్రత్యేక విమానాన్ని పంపించారు. ఆ విమానం కూడా అక్కడకు చేరుకునేందుకు ఆలస్యమైంది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఎయిరిండియా ఈ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. పైగా, వారి ప్రయాణ చార్జీని రిఫండ్ ఆఫర్ ప్రకటించింది. 
 
"మిమ్మల్ని శాన్‌ఫ్రాన్సిస్కోకు చాలా ఆలస్యంగా తీసుకెళ్లినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ఇబ్బంది ఎదురైంది. అత్యవసర పరిస్థితుల్లో రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాం. మిమ్మల్ని తరలించేందుకు మరో ప్రత్యేక విమానం పంపించినప్పటికీ అది కూడా ఆలస్యం అయింది. మీ సహనానికి ఎప్పటికీ రుపణపడి ఉంటాం. గతాన్ని మేం మార్చలేమని, కానీ, కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఇందుకుగాను మీ ప్రయాణినికి పూర్తి రీఫండ్ ఇస్తామని, భవిష్యత్తులో మా విమానాల్లో ప్రయాణించేందుకు ఓ ట్రావెల్ వోచర్ కూడా ఇస్తున్నామని" తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments