Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుర్గ్ - పూరి ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. ప్రయాణికుల భయభ్రాంతులు

durg - puri express
, శుక్రవారం, 9 జూన్ 2023 (09:31 IST)
దేశ ప్రజలకు దిగ్భ్రాంతికి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నుంచి తేరుకోకముందే మరో రైలు ప్రమాదం జరిగింది. దుర్గ్ - పూరి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో ఏకంగా 288 మంది చనిపోగా, 1100 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఒడిశాలో జరిగింది. ఇపుడు మరో ప్రమాదం ఈ రాష్ట్రంలోనే జరిగింది. సకాలంలో ప్రయాణికులు దీన్ని గుర్తించడంతో ఘోర ప్రమాదం తప్పింది. 
 
దుర్గ్ - పూరి ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ కింది భాగంలో మంటలు చెలరేగడాన్ని ప్రయాణికులు సకాలంలో గుర్తించగలిగారు. దీంతో చైన్ లాగి రైలును నిలిపివేసి ప్రాణాలతో బయటకు వచ్చారు. ఈ ప్రమాదం ఒడిశా రాష్ట్రంలోని నౌపడ జిల్లాలోని ఖరియాల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఉదంతం పూరికి బయలుదేరింది. 
 
నంబర్ 18426 రైలు ఈ సాయంత్రం ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ నుంచి ఒడిశాలోని పూరికి బయలుదేరింది. మార్గమధ్యంలో రాత్రి 10.07 నిమిషాల సమయంలో ఖరియార్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏసీ బోగీలో నుంచి నల్లటి పొగలు వెలువడ్డాయి. ఆ వెంటనే బోగీ చక్రాల వద్ద మంటలు చెలరేగాయి. బీ3 కోచ్ నుంచి కిందిభాగం నుంచి మంటలు చెలరేగినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. 
 
చక్రాల వద్ద బ్రేక్స్ జామ్ కావడం వల్ల అవి రాపిడికి గురై మంటలు వచ్చాయని నిర్ధారించారు. అదేసమయంలో అలారం చైన్ పుల్లింగ్ పని చేయలేదని పేర్కొన్నారు. తొలుత పొగ వెలువడుతుంది. ఆ వెంటనే మంటలు చెలరేగడాన్ని గుర్తించిన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు మంచిర్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన.. కలెక్టరేట్ భవనం ప్రారంభం