వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేశాం.. రిలీజ్ చేశాం

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (11:13 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైకాపా సిట్టింగ్ ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డిని ఈ నెల మూడో తేదీన అరెస్టు చేశామని సీబీఐ తెలిపింది. ఆ తర్వాత ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను వెంటనే విడుదల చెసినట్టు చెప్పారు. ఈ నెల మూడో తేదీన విచారణ కోసం కార్యాలయానికి వచ్చినపుడు అవినాశ్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకుని వెంటనే ఆయనను విడిచిపెట్టింది. 
 
తెలంగాణ హైకోర్టు గత నెల 31వ తేదీన అవినాశ్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనను అరెస్టుచేయాల్సి వస్తే పూచీకత్తులు తీసుకుని వెంటనే విడుదల చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత శనివారం ఆయన విచారణ కోసం కార్యాలయానికి వచ్చినపుడు సాంకేతికంగా అరెస్టు చేసి పూచీకత్తులు తీసుకుని విడుదల చేసింది. ఈ విషయం బయటపడకుండా సీబీఐ.. అవినాశ్ రెడ్డి వర్గాలు జాగ్రత్త వహించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తె న్యూడ్ ఫోటోలు అడిగారు: నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన

ముగిసిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నిశ్చితార్థం

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments