Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న అంతర్వేది రథాన్ని ప్రారంభిచనున్న సీఎం జగన్

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (08:45 IST)
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చెందిన రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద చర్చకేదారితీసింది. విపక్ష రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగాయి. బీజేపీ, జనసేన, టీడీపీలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగాయి. దీంతో ప్రభుత్వం స్పందించి, అంతర్వేదికి కొత్త రథం తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ రథం తయారీ పనులు ఇపుడు పూర్తయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో ఈ రథాన్ని ఆలయానికి అప్పగించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి రానున్నారు. ఆయన 11.20కి హెలికాప్టర్‌లో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలోని హెలిప్యాడ్‌ వద్ద దిగుతారు. 11.30కు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురాన్ని సందర్శిస్తారు. అనంతరం స్వామివారిని, శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 12.10 గంటలకు ఆలయ నూతన రథాన్ని ప్రారంభిస్తారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments