Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌పాల్ కోసం మళ్లీ నిరాహారదీక్ష : అన్నా హజారే ప్రకటన

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (16:25 IST)
లోక్‌పాల్ నియామకం కోసం ఈనెల 30వ తేదీ నుంచి నిరాహారదీక్ష చేయనున్నట్టు ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే ప్రకటించారు. తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతోంది. 
 
ఇందులో అన్నా హజారే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌పాల్‌, లోకాయుక్త 2013లో తయారైంది. 2014లో చట్టరూపం దాల్చింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ప్రకటించారని గుర్తుచేశారు. 
 
కానీ, అదే యేడాదిలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎంతో కొంత దీనిపై ముందడుగు పడుతుందని ఆశించాం. కానీ గడిచిన ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు. అధికారం చేపట్టి ఇంతవరకూ లోక్‌పాల్‌ను నియమించలేదు. ఇందుకు నిరసనగా తాను ఈ నెల 30వ తేదీ నుంచి తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. 
 
ఆ తర్వాత హెచ్‌ఐసీసీ సదస్సులో మాట్లాడుతూ, ఒక యేడాది, ఐదేళ్లు, పదేళ్లు ప్రాతిపదికగా లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. యువశక్తి సరికొత్త దిశగా ప్రయాణించి అద్భుతాలు సృష్టించాలని కోరారు. జీవింతలో సాధించాల్సిన లక్ష్యాలపై ముందే స్పష్టత ఉండాలన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయొద్దన్నారు. నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస కూడా యువతలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments