Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ రష్మీ గౌతమ్ ఫైర్.. వాటిని కోసేయాలి..(video)

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (11:35 IST)
బీహార్‌లోని బాగల్‌పూర్ జిల్లాలో ఓ బాలికపై రేపిస్ట్‌లు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. పదహారేళ్ల ఇంటర్ విద్యార్థిని ఇంట్లోకి శుక్రవారం నలుగురు దుండగులు చొరబడ్డారు. బాలిక తల్లిని గన్‌తో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి యత్నించారు. అయితే బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. ఘటనపై కేసు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ ఘటనపై జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించింది. యాసిడ్ దాడులపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే రష్మీ గౌతమ్.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మండిపడింది. ముఖ్యంగా తాజాగా బీహార్‌లో జరిగిన ఓ కీచక పర్వంపై స్పందించింది. 
 
ఈ మేరకు సోషల్ మీడియాలో రష్మీ పోస్టు చేసింది. రోజుకో కొత్త కేసు నమోదవుతోంది. గతంలో జరిగిన ఘటనల కంటే ప్రస్తుతం జరిగే ప్రతీ ఘటన ఎంతో భయానకంగా ఉంటోంది. మగాళ్లమని రెచ్చిపోతూ అఘాయిత్యాలకు పాల్పడే కామాంధుల పురుషాంగాలను కోసేయాలి. లేదంటే ఒక్క రాత్రిలోనే స్త్రీ జాతి అంతరించిపోతుంది. అలా చేసినప్పుడే మానవాళికి మహిళ విలువ తెలుస్తుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 
 
రష్మీ గౌతమ్ ట్వీట్‌కు నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయపడుతూ.. పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం రష్మీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments