నా గ్రాండ్ పేరెంట్స్ ఓట్లు లేవు... ఏమయ్యాయి? యాంకర్ రష్మి గౌతమ్(Video)

గురువారం, 11 ఏప్రియల్ 2019 (14:11 IST)
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఓటు వేసేందుకు నానా తంటాలు పడ్డారు. చివరికి ఎలాగో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓటు వేశారు. కానీ ఆమె గ్రాండ్ పేరెంట్స్ ఓట్లు మాత్రం గల్లంతయ్యాయి. దీనిపై ఆమె ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ... " నా గ్రాండ్ పేరెంట్స్ గత ఎన్నికల్లో ఓటు వేశారు. మరి ఇప్పుడు వారి ఓట్లు ఎందుకు లేకుండా పోయాయి. వాళ్లంతా ఇక్కడివారే.
 
కనీసం ఛాలెంజ్ ఓటైన ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు. వాళ్లు ఓటు వేయాలి, ఏంటి మార్గం? నా ముందే 10 మంది వున్నారు. ఇంతమంది పేర్లు మాయమైతే ఏం జరుగుతోంది. దీనికి మీరేం పరిష్కారం చూపిస్తారు. నా తల్లి ఓటు వేశారు. గత ఎన్నికల్లో మేమంతా ఓట్లు వేశాము. కానీ ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోయాయి. పరిష్కారం కావాలి" అంటూ ఆమె డిమాండ్ చేశారు. చూడండి వీడియోలో.. 

https://t.co/r7BAVEWLGZ

— rashmi gautam (@rashmigautam27) April 11, 2019

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వేటకొడవళ్ళతో నరుక్కున్న టీడీపీ - వైకాపా కార్యకర్తలు