Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్ర అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం

Webdunia
సోమవారం, 11 జులై 2022 (14:45 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సాగుతున్న అమర్నాథ్ యాత్రను తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలు రావడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో అనేక మంది భక్తులు కొట్టుకునిపోయి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతయ్యారు. వీరిలో అనేక మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి. దీనికితోడు భారత ఆర్మీ, వైమానిక సిబ్బంది, ఐటీబీపీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన అమర్నాథ్ యాత్ర మార్గాన్ని సిద్ధం చేశారు. అలాగే, మంచు శివలింగం ఉండే గుహ వద్ద మట్టి, రాళ్లను భద్రతా సిబ్బంది తొలగించారు. దీంతో ఈ యాత్ర చేసేందుకు భక్తులకు అనుమతిచ్చారు. 
 
మరోవైపు, గువవద్ద టోకెన్లు జారీచేసి శివలింగ దర్శనానికి పంపుతున్నారు. అమర్నాథ్ గుహకు పంత్‌తర్నీ వైపు నుంచి వెళ్లాలని, దర్శనం అనంతరం బల్తాల్ మార్గంలో వెనక్కి రావాలని సూచిస్తున్నారు. కాగా, ఈ ఆకస్మిక వర్షాలకు ముందు దాదాపు 1.13 లక్షల మంది అమర్నాథ్ యాత్రా భక్తులు మంచు శివలింగాన్ని దర్శనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments