Publish Date: Sun, 10 Jul 2022 (16:31 IST)
Updated Date: Sun, 10 Jul 2022 (16:19 IST)
ఇటీవల అమర్నాథ్ యాత్రలో చోటుచేసుకున్న విషాదంలో ఆచూకి లభించని వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీరిలో 84 మంది తెలుగు యాత్రికులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరి ఆచూకీని కనిపెట్టారు. ప్రస్తుతం వీరంతా సురక్షితంగా ఉన్నట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి.
కాగా, విరిగిపడిన కొండచరియల్లో దాదాపు 40 మంది వరకూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇదేసమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 84 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
యాత్రికులు, వారి కుటుంబీకుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఉన్నతాధికారులను శ్రీనగర్‌కు పంపించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
అమర్‌నాథ్ క్షేత్రం సమీపంలో ఆకస్మికంగా సంభవించిన వరద విపత్తులో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. వంద మందికిపైగా గాయపడగా వారికి వివిధ ప్రాంతాల్లో చికిత్సలు అందిస్తున్నారు. మరో 40 మంది కోసం సైన్యం, కేంద్ర బలగాలు, పోలీసులు నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టాయి. అలాగే, 15 వేల మంది అమర్నాత్ యాత్రికులకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.