Publish Date: Sat, 09 Jul 2022 (12:17 IST)
Updated Date: Sat, 09 Jul 2022 (12:20 IST)
అమర్నాథ్ యాత్రలో వరద బీభత్సం సృష్టించడంతో 16 మంది మృత్యువాత పడ్డారు. 40 మందికి పైగా గల్లంతయినట్లు సమాచారం. కాగా అమర్నాథ్ యాత్రకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వందలాది మంది భక్తులు వెళ్లారు.
తెలంగాణ రాష్ట్రంలోని జనగామకి చెందిన నలుగురు వ్యక్తులు ఈ నెల 3న యాత్రకు వెళ్లారు. తాడూరి రమేష్, సిద్దలక్ష్మి, లక్ష్మీనరసయ్య, సత్యనారాయణ వీరిలో వున్నారు. వరద ప్రమాదం సంభవించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఐతే రమేష్, సత్యనారాయణ తాము సురక్షితంగానే వున్నామంటూ ఫోన్ చేసి చెప్పారు. కానీ సిద్దలక్ష్మి, లక్ష్మీనర్సయ్య ఆచూకి ఇప్పటివరకూ తెలియరాలేదు. దీనితో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.