Publish Date: Mon, 23 Aug 2021 (12:52 IST)
Updated Date: Mon, 23 Aug 2021 (12:53 IST)
సుప్రిసిద్ధ అమర్నాథ్ యాత్ర ముగిసింది. ఈ యాత్ర మొత్తం 56 రోజుల పాటు సాగింది. చారీ ముబారక్ ఈశ్వరుడి చెంతకు చేరుకోవడం వల్ల.. ఆలయ అధికారులు, పండితులు, సాధువులు సమపన్ పూజను నిర్వహించారు.
శ్రావణ పూర్ణిమ రోజు నిర్వహించిన సంప్రదాయ పూజా కార్యక్రమాలతో 56 రోజుల సుప్రసిద్ధ అమర్నాథ్ యాత్రకు ముగిసినట్టయింది. హిమలింగ రూపంలో గుహలో కొలువైన ఈశ్వరుడి చెంతకు చారీ ముబారక్ చేరుకోవడం వల్ల.. ఆలయాధికారులు, పండితులు, సాధువులు ఘనంగా సమపన్ పూజను నిర్వహించారు.
కాగా, ఈ యాత్ర జూన్ 28న సంప్రదాయబద్దంగా యాత్రను ప్రారంభమైంది. పుణ్యక్షేత్రం బోర్డు.. ఆనవాయితీగా వస్తున్న ఆచారాల్ని, క్రతవుల్ని పాటిస్తూ రక్షాబంధన్ రోజున సంప్రదాయ ముగింపు పూజ కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించింది.
కొవిడ్ 19 దృష్ట్యా సామాన్య భక్తులకు ఈ యాత్రకు అవకాశం లేకపోవటంతో టీవీ ఛానెల్‌లు, సామాజికమాధ్యమాల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యక్ష ప్రసారాలను శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు ఏర్పాటు చేసింది.