Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఠాగూర్
ఆదివారం, 15 జూన్ 2025 (17:57 IST)
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి దేశ ప్రజలు ఇంకా తేరుకోలేనే లేదు. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో ఏకంగా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ఇదిలావుంటే మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం ఏకంగా కొన్ని గంటల పాటు పాటు రన్‌వేపై ఉండాల్సివచ్చింది. ఈ ఘటనపై సదరు సంస్థ స్పందించింది. 
 
వివరాలను పరిశీలిస్తే, ఎయిరిండియా విమానం ఎక్స్ 1,511 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ విమానాశ్రయం నుంచి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాకు బయలుదేరాల్సివుంది. టేకాఫ్ అయిన కాసేపటికే ముందు విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీన్ని వెంటనే గుర్తించిన సంస్థ అప్రమత్తమైంది. దీంతో విమాన ప్రయాణాన్ని నిలిపివేసింది. కొన్ని గంటలు ఆలస్యంగా బయలుదేరనుందని తెలిపింది. 
 
అలాగే, ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, టేకాఫ్‌కి కాసేపు ముందే సాంకేతిక లోపాన్ని గుర్తించాం. ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. వారికి రీషెడ్యూల్ లేదా రీఫండ్ చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉంది అని ఓ ప్రటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments