Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌న్‌వేపై జారిన విమానం.. ముక్కు భాగం టైర్ పగిలింది

కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిరిండియాకు చెందిన విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ విమానాశ్ర‌యంలో ఎయిరిండియా విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో ర‌న్‌వే ట్రాక్‌పై నుంచి ప‌క్క

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (11:49 IST)
కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిరిండియాకు చెందిన విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ విమానాశ్ర‌యంలో ఎయిరిండియా విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో ర‌న్‌వే ట్రాక్‌పై నుంచి ప‌క్క‌కు దిగిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌యాణికులంతా సుర‌క్షితంగా ఉన్నారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో విమానంలో 102 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు. 
 
అబుదాబి నుంచి కొచ్చికి వ‌చ్చిన ఎయిరిండియా విమానం ఒకటి సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత విమానం పార్కింగ్ ఏరియాకు వస్తుండగా, ర‌న్‌వే ట్రాక్ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకుంది. మంగళవారం వేకువజామున 2.40 నిమిషాల‌కు ఈ సంఘట‌న జ‌రిగింది. 
 
ఆ స‌మ‌యంలో విమానాశ్ర‌య ప్రాంతంలో వ‌ర్షం ప‌డుతున్న‌ట్లు అధికారులు చెప్పారు. అయితే నిచ్చెన సాయంతో ప్ర‌యాణికులు విమానం దిగారు. బోయింగ్ 373-800 విమానానికి చెందిన ముక్కు భాగం టైర్ ప‌గిలిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ ఘ‌ట‌నపై విమానాశ్రయ అధికారులు విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments