Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోక్లాం వివాదం తర్వాత జిన్‌పింగ్‌తో నరేంద్ర మోడీ భేటీ

చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. భారత్ చైనాల మధ్య తలెత్తిన డోక్లాం వివాదం తర్వాత జరిగనున్న తొల

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (11:28 IST)
చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. భారత్ చైనాల మధ్య తలెత్తిన డోక్లాం వివాదం తర్వాత జరిగనున్న తొలి సమావేశం కావడం గమనార్హం. ఇందులో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపనున్నారు. ముఖ్యంగా డోక్లాం వివాదం తర్వాత రెండు దేశాల అధినేతలు కలుసుకోనుండటం ఇదే తొలిసారి. 
 
మయాన్మార్‌కు బయలుదేరే ముందు ప్రధాని మోడీ మధ్యాహ్నం 12.30 గంటలకు జిన్‌పింగ్‌తో సమావేశమవుతారని భారత విదేశాంగశాఖ అధికారులు తెలిపారు. అయితే చర్చాంశాలు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. ఇటీవల సిక్కిం సమీపంలోని డోక్లాంలో భారత, చైనా దళాలు నువ్వానేనా అన్నట్టుగా మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలావుండగా, బ్రిక్స్ శిఖరాగ్ర సభ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో విడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారు ద్వైపాక్షిక వాణిజ్య అభివృద్ధి, పెట్టుబడులపై ప్రధానంగా చర్చించారు. ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి కూడా ప్రస్తావనకు వచ్చిందని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ మీడియాకు తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమర్‌తోనూ ప్రధాని మోడీ విడిగా సమావేశమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments